కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త పరిశ్రమను స్థాపించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ, కాకినాడ సెజ్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
తొండంగి మండలం ఏవీ నగరం సమీపంలో 80 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఉక్కు తయారీలో కీలకమైన మెటలర్జికల్ కోక్ ఉత్పత్తి ఈ యూనిట్‌లో జరగనుంది. ప్రస్తుతం అదే ప్రాంతంలో అరబిందో ఫార్మాకు చెందిన పలు పరిశ్రమలు కొనసాగుతుండగా, ఈ కొత్త యూనిట్‌తో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా మరో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరగడమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడనుంది.గ్రీన్ కోక్ ఎనర్జీ ఎండీ నటరాజన్, కాకినాడ సెజ్ ఎండీ & సీఈవో ఓజిలి రామ్ రెడ్డి మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ పరిశ్రమ స్థాపనతో తొండంగి, ఉప్పాడ మండలాల్లో పారిశ్రామిక రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















