దిల్లీ – దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఇటలీకి చెందిన ప్రముఖ సంస్థ లియోనార్డోతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దేశంలో ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు పునాది పడనుంది.
ఈ మేరకు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, లియోనార్డో సంస్థల ప్రతినిధులు మంగళవారం భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిస్తూ, దేశ స్వావలంబన లక్ష్యాన్ని బలోపేతం చేస్తుందని అదానీ గ్రూప్ తెలిపింది.
ఈ భాగస్వామ్యం ద్వారా లియోనార్డోకు చెందిన AW169M, AW109 TrekkerM హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేయనున్నారు. ముఖ్యంగా భారత సైన్యం, వైమానిక దళ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దశలవారీగా స్థానిక తయారీ పెంచడంతో పాటు, మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్ (MRO), పైలట్ల శిక్షణ వంటి సౌకర్యాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్‌లో హెలికాప్టర్ల వినియోగం తక్కువగా ఉండగా, దేశంలో 250 కంటే తక్కువ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. వచ్చే పదేళ్లలో సంవత్సరానికి సుమారు 100 హెలికాప్టర్ల అవసరం ఉంటుందని, సాయుధ దళాల కోసం వెయ్యికి పైగా హెలికాప్టర్లు కావొచ్చని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈఓ అశీష్ రాజ్‌వంశీ తెలిపారు.
ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలోని సివిల్, డిఫెన్స్ అవసరాలు తీర్చేందుకు పునాది వేశామని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ అన్నారు. భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఎదుగుతోందని, సాయుధ దళాల్లో హెలికాప్టర్ల అవసరం వేగంగా పెరుగుతోందని లియోనార్డో హెలికాప్టర్స్ ఎండీ గియాన్ పియరో కుటిల్లో పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















