ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి పరీక్షల ఒత్తిడితో మృతిచెందిన ఘటన నగరంలో కలచివేసింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం, కాప్రా సర్కిల్ పరిధిలోని మాధవపురి డీఎల్‌ఆర్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న కె. శ్యాంప్రసాద్ కుమార్తె హృషిత (20) ఇటీవల ఇంటర్ చదువును పూర్తి చేసింది. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో అవి పూర్తి చేయాలని కుటుంబ సభ్యులు కోరగా, గత కొద్ది రోజులుగా పరీక్షలకు సిద్ధమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మృతురాలి తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కుషాయిగూడ ఎస్‌ఐ సాయిలు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం తీసుకోవడం ముఖ్యమని వారు చెబుతున్నారు.
సహాయం అవసరమైతే:
మానసిక ఒత్తిడి లేదా ఆత్మహానికర ఆలోచనలు ఉంటే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులను సంప్రదించాలి. జాతీయ టోల్‌ఫ్రీ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ KIRAN – 1800-599-0019 (24×7) ద్వారా సహాయం పొందవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















