చైనాలో మరోసారి భూమి కుంగిపోవడం కలకలం రేపింది. షాంఘై నగరంలో కొత్త మెట్రో టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో రోడ్డులోని ఒక భాగం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. క్షణాల్లోనే అక్కడ భారీ సింక్‌హోల్ ఏర్పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఫిబ్రవరి 12న ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిర్మాణ పనుల ప్రభావంతో నేల బలహీనపడిందా? లేక సాంకేతిక లోపాల వల్లా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. రోడ్ కుంగిపోతున్న దృశ్యాలు చూసిన స్థానికులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
అధికారుల ప్రకటన ప్రకారం ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఎలాంటి గాయాలు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించారు. అనంతరం రహదారిని పూడ్చే పనులు ప్రారంభించారు.ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలోని కార్యాలయాలు, అపార్ట్‌మెంట్‌లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు. 2024లో మిన్‌హాంగ్ జిల్లాలో మురుగునీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో రోడ్డులో కొంత భాగం కుంగిపోయిన ఘటన కూడా నమోదైంది. గతంలోనూ పలు సందర్భాల్లో సింక్‌హోల్‌లు ఏర్పడినట్లు సమాచారం.ఈ తాజా ఘటనపై నెటిజన్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. నగర అభివృద్ధి పనుల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















