భువనేశ్వర్: విధి నిర్వహణలో ఉన్న పోలీసులను మృత్యువు లారీ రూపంలో కబళించిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. Odisha రాష్ట్రంలోని Jharsuguda సదర్ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో 49వ నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రంతా గస్తీ నిర్వహించిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం బరగఢ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన ఒక కానిస్టేబుల్ ఝార్సుగుడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను ఎస్‌ఐ నిరంజన్ కుజురు, కానిస్టేబుళ్లు లింగరాజ్ ధరువా, దేవదత్తసింగ్, కాశీరామ్ బోయ్, హోంగార్డు భక్తబంధు మీర్ధాగా గుర్తించారు. వీరంతా ఝార్సుగుడ ఠాణా సిబ్బందేనని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను ఝార్సుగుడ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి Mohan Charan Majhi తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ దుర్ఘటనతో పోలీసు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















