లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు Stock Market Opening Bell |దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ట్రంప్ టారిఫ్‌ల రద్దు వంటి పరిణామాలు మార్కెట్ (Stock Market) సెంటిమెంట్‌ను బలపర్చాయి. దీంతో సూచీలు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకగబాకగా.. నిఫ్టీ 25,700 మార్క్ పైన కదలాడుతోంది.ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 643.74 పాయింట్ల లాభంతో 83,458.45 వద్ద, నిఫ్టీ 193.85 పాయింట్లు పెరిగి 25,765.10 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పెరిగి 90.75 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్‌కేర్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యునిలివర్ షేర్లు రాణిస్తున్నాయి. సిప్లా, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నేటి ఆసియా-పసిఫిక్ మార్కెట్లు రాణిస్తున్నాయి. దక్షిణ కొరియా కోస్పి 1.7శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.17శాతం మేర పెరిగాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని గతవారం అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచ దేశాల ఉత్పత్తులపై రెండు విడతలుగా 15% పన్ను విధిస్తున్నట్లు ట్రంప్ మళ్లీ ప్రకటనలు చేశారు. దీంతో ఇంతకుముందే మనదేశ ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18 శాతానికి తగ్గించగా.. ఇప్పుడది 15% కానుంది.గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నేటి ఆసియా-పసిఫిక్ మార్కెట్లు రాణిస్తున్నాయి. దక్షిణ కొరియా కోస్పి 1.7శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.17శాతం మేర పెరిగాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని గతవారం అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచ దేశాల ఉత్పత్తులపై రెండు విడతలుగా 15% పన్ను విధిస్తున్నట్లు ట్రంప్ మళ్లీ ప్రకటనలు చేశారు. దీంతో ఇంతకుముందే మనదేశ ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18 శాతానికి తగ్గించగా.. ఇప్పుడది 15% కానుంది.
సూచీల పరిస్థితి (ఉదయం 9:30 గంటలకు)
- సెన్సెక్స్ 643.74 పాయింట్లు ఎగబాకి 83,458.45 వద్ద ట్రేడ్ అవుతోంది
- నిఫ్టీ 193.85 పాయింట్లు పెరిగి 25,765.10 వద్ద కొనసాగుతోంది
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు మెరుగై ₹90.75 వద్ద ఉంది
రాణిస్తున్న షేర్లు
- యాక్సిస్ బ్యాంక్
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
- మ్యాక్స్ హెల్త్‌కేర్
- టెక్ మహీంద్రా
- హిందుస్థాన్ యునిలివర్
ఒత్తిడిలో ఉన్న షేర్లు
- సిప్లా
- ఓఎన్జీసీ
- ఏషియన్ పెయింట్స్
- కోల్ ఇండియా
- బజాజ్ ఫిన్‌సర్వ్
గ్లోబల్ మార్కెట్ల ప్రభావం
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా, నేటి ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా సానుకూలంగా కదులుతున్నాయి.
- దక్షిణ కొరియా కోస్పి 1.7% పెరిగింది
- ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.17% లాభపడింది
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















