ఆర్టీసీ డ్రైవర్లు ఎదుర్కొనే పని ఒత్తిడి, సమయ పరిమితులను ప్రతిబింబించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటల తరబడి బస్సు నడిపిన ఓ ఆర్టీసీ డ్రైవర్ కొద్దిసేపు విరామం దొరకడంతో భోజనం చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో బస్సు ఎక్కడానికి వచ్చిన కొందరు ప్రయాణికులు అతనికి భోజనం చేసే సమయం కూడా ఇవ్వకుండా గొడవకు దిగిన ఘటన చోటుచేసుకుంది.
విరామ సమయంలో బస్సులో ఎవరూ లేని సమయంలో డ్రైవర్ భోజనం చేయాలని ప్రయత్నించగా, అక్కడికి వచ్చిన ప్రయాణికులు వెంటనే బస్సు ఎక్కనివ్వాలని పట్టుబట్టారు. డ్రైవర్ “మనిషి అన్నాక భోజనం చేయాల్సిందే కదా… అందరూ బస్సులో ఉంటే నేను ఎలా తింటాను? కనీసం పది నిమిషాలు సమయం ఇవ్వండి” అని వేడుకున్నప్పటికీ, వారు వినిపించుకోలేదు. పైగా “నిలబడి తిను” అంటూ ఒక ప్రయాణికుడు దురుసుగా మాట్లాడటం వీడియోలో వినిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. డ్రైవర్లు కూడా మనుషులేనని, వారికి కనీస గౌరవం ఇవ్వాలని, విధుల్లో ఉన్న వారికి మానవత్వంతో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















