శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మార్చి 24న తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ పూజలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి వాటిని నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. అలాగే మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం నిర్వహించనున్నారు.
మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. దీంతో ఒంటిమిట్ట ప్రాంతంలో ఇప్పటికే భక్తి వాతావరణం నెలకొంది.దండరామస్వామి ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















