మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 230 మంది మాజీ మావోయిస్టులకు నోటీసులు జారీ చేయడంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కలకలం రేగింది. నోటీసులు అందుకున్న వారు త్వరలో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఐఏ అధికారులు ఆదేశించినట్లు సమాచారం.
గత సంవత్సరం అక్టోబర్ 18న కోహెడ ప్రాంతంలో ‘నారాయణపూర్ అమరుల సంస్మరణ సభ’ పేరిట ఒక సమావేశం నిర్వహించారు. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు రామచంద్రారెడ్డి (వికల్ప్), కడారి సత్యనారాయణరెడ్డిలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్, వరంగల్ ప్రాంతాలైన హుజూరాబాద్, సైదాపూర్, భీమదేవరపల్లి, వంగర, ముల్కనూరు, మాణిక్యాపూర్, ఆకునూర్, ఘన్‌పూర్, కమలాపూర్, టేకుమట్ల, పరకాల, వెంకటాపూర్, వేలేరు, ధర్మసాగర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ఈ సభకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సామాజిక కార్యకర్త సోనీ సోరి, రచయిత గాదె ఇన్నయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో గాదె ఇన్నయ్యతో పాటు మరికొందరిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు భాగంగానే సభకు హాజరైన మాజీ మావోయిస్టులను విచారణకు పిలవడానికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానికంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. అధికారులు ఈ వ్యవహారంపై మరింత సమాచారం సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews


















