గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన వివాదం కొట్లాటగా మారడంతో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, గొడవ సమయంలో ఒక విద్యార్థి భరత్ కుమార్ అనే విద్యార్థిని బలంగా కొట్టడంతో అతని మెడ భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే సహచరులు అతన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ భరత్ కుమార్ మృతి చెందాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఘటనాస్థలానికి చేరుకుని, బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు. భరత్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో నిరసన చేపట్టారు.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ అన్సారియా, స్వయంగా అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో ఆందోళన విరమించగా, అనంతరం భరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















