మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. Maharashtraలో ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికలను వలలో వేసుకుని లైంగికంగా వేధిస్తూ, వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, పరాత్వడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే నిందితుడు బాలికలను మాయమాటలు చెప్పి Mumbai, Puneలకు తీసుకెళ్లి అక్కడ వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించేవాడు. అనంతరం ఆ వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేయడమే కాకుండా, కొన్నింటిని ఆన్‌లైన్‌లో కూడా పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న రాజ్యసభ ఎంపీ Anil Bonde కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో వందలాది అసభ్యకర వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోలను మరెవరికి పంపించాడా అనే దిశలో సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే ఆన్‌లైన్‌లో ఉన్న వీడియోలను తొలగించే చర్యలు కూడా చేపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















