హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక మరియు పరిపాలన అవకతవకలపై సీబీసీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ బృందానికి ఐపీఎస్ హోదాలోని అదనపు కమిషనర్ నేతృత్వం వహించనున్నారు.
హెచ్‌సీఏలోని పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన హైకోర్టు, అసోసియేషన్‌లో జరుగుతున్న అవకతవకలకు తార్కిక ముగింపు ఇవ్వడానికే ఈ దర్యాప్తు అవసరమని స్పష్టం చేసింది. తప్పు జరిగిందని లేదా జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, కేవలం అనుమానాలను నివృత్తి చేసి సంస్థను చట్టబద్ధంగా కొనసాగించడమే లక్ష్యమని కోర్టు పేర్కొంది.
అదేవిధంగా, హెచ్‌సీఏ నిర్వహణ కోసం జస్టిస్ పి. నవీన్‌రావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీ (ఎపెక్స్ కౌన్సిల్) కొనసాగాలని హైకోర్టు ఆదేశించింది. లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ, ఆటగాళ్ల ఎంపిక, కోచ్‌లు, సిబ్బంది నియామకాలు వంటి అంశాల్లో ఈ కమిటీకి పూర్తి అధికారాలు కల్పించింది.
దర్యాప్తు పూర్తయ్యే వరకు క్రికెట్ నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా జస్టిస్ నవీన్‌రావు పర్యవేక్షణలోనే కార్యకలాపాలు కొనసాగాలని కోర్టు స్పష్టం చేసింది. ఆయన హయాంలో క్రికెట్ ప్రమాణాలు మెరుగుపడ్డాయని కూడా హైకోర్టు ప్రశంసించింది.
సిట్ దర్యాప్తునకు రాష్ట్ర ఏజెన్సీలు, హెచ్‌సీఏ అధికారులు, ఉద్యోగులు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అవసరమైన రికార్డులు, నివేదికలు అందించాలని కూడా సూచించింది. హెచ్‌సీఏలో పునరావృతమవుతున్న ఆరోపణలు, ఆర్థిక అవకతవకల నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరమని భావించిన హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















