తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటిని లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. జనగణన సేకరణ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఆసుపత్రులు, పాఠశాలలు, గుడులు, గుడిసెలు, అద్దె భవనాలు సహా ప్రతి నిర్మాణాన్ని జనగణనలో పరిగణనలోకి తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రతి భవనంలో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి పూర్తిస్థాయి సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు.
2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన ప్రారంభమవుతుందని, అప్పటివరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఆ దశలో వ్యక్తిగత వివరాల సేకరణ చేపడతామని వెల్లడించారు.
ఇళ్ల గణన కోసం ప్రాంతాలను బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను నియమిస్తామని తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి భవనాల్లోని ఇళ్ల సంఖ్యను గుర్తించి నమోదు చేస్తారని ఆమె వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో సమగ్ర జనాభా, గృహ వివరాల డేటా సిద్ధం చేయనున్నట్లు భారతీ హాళికెరి తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















