పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైనప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్‌ల భద్రతపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆమె స్వయంగా పరిశీలించారు. భవానీపుర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు అక్కడ భద్రపరిచినట్టు అధికారులు తెలిపారు. అనంతరం మమత మాట్లాడుతూ, ఎవరైనా ఈవీఎంలను తారుమారు చేయాలని లేదా ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయాలని ప్రయత్నిస్తే తాను వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే జీవన్మరణ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.
ఇక ఉత్తర కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో భద్రపరిచిన ఈవీఎంలపై టీఎంసీ నేతలు ధర్నాకు దిగారు. ఎన్నికల అనంతరం ఈవీఎంల నిర్వహణలో లోపాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ, ఎన్నికల సంఘం మధ్య కుమ్మక్కు జరిగిందని పేర్కొంటూ, సీసీటీవీ దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. పార్టీ సీనియర్ నేత తాపస్ రాయ్ మాట్లాడుతూ, టీఎంసీ ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















