మయన్మార్ మాజీ నేత అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ తెలిపింది. సుమారు 80 ఏళ్ల వయస్సున్న సూకీ ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో గృహనిర్బంధంలో ఉన్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన తాజా ఫోటోను కూడా అధికారులు విడుదల చేశారు. అందులో ఆమె పోలీసుల సమక్షంలో ఉన్న దృశ్యం కనిపిస్తోంది.
2021 ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైన్యం అధికారం చేపట్టిన తర్వాత అంగ్ సాన్ సూకీని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే నిర్బంధంలో ఉన్నారు. ఇన్నేళ్లుగా ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.తాజా నిర్ణయంతో ఆమె స్థితిగతులపై కొంత స్పష్టత వచ్చినప్పటికీ, ఇది తాత్కాలిక చర్యా లేదా శాశ్వత మార్పా అనే అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















