ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈసారి నోబెల్ కమిటీకి మొత్తం 287 నామినేషన్లు అందినట్లు సమాచారం. అందులో 208 మంది వ్యక్తులు, 79 సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో ట్రంప్ పేరు కూడా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ట్రంప్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్, ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్ వంటి ప్రముఖుల పేర్లు కూడా నామినేషన్లలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నోబెల్ కమిటీ ఈ పేర్లను గోప్యంగా ఉంచుతుంది కాబట్టి అధికారిక ధ్రువీకరణ లేదు. గతేడాది ట్రంప్ ఎనిమిది యుద్ధాలు ఆపానని పేర్కొంటూ నోబెల్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ బహుమతి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కింది. దీంతో ఆయనకు నిరాశ తప్పలేదు.
తాజాగా కూడా ఆయన పేరు నామినేషన్లలో ఉందన్న వార్తలతో మరోసారి చర్చ మొదలైంది. అయితే ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు, ఇతర అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయనకు ఈసారి బహుమతి దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2026 నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 9న ప్రకటించనుండగా, డిసెంబర్ 10న ఓస్లోలో ప్రదానం చేయనున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















