కరీంనగర్‌లో శనివారం బంద్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై భాజపా దాడికి నిరసనగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే బీఆర్‌ఎస్ బంద్‌కు కరీంనగర్ ప్రజలకు సంబంధమేంటని భాజపా ప్రశ్నిస్తూ, బంద్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. మరోవైపు భాజపా, బీఆర్‌ఎస్ మధ్య జరిగిన దాడులు వారి వ్యక్తిగత వ్యవహారమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
విభిన్న రాజకీయ ప్రకటనల నేపథ్యంలో కరీంనగర్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు.
స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను గృహనిర్బంధం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ శ్రేణులను ఉదయాన్నే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో కరీంనగర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















