రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ పెట్టుబడితో 600 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.కొండాపురం మండలం టి.కోడూరు గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులను మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుంది.
టి.కోడూరు–బొడాయిపల్లి ప్రాంతంలో రూ.1200 కోట్లతో 300 మెగావాట్ల ప్లాంట్, పెద్దముడియం–గోవిందపల్లె ప్రాంతాల్లో మరో రూ.1200 కోట్లతో 300 మెగావాట్ల ప్లాంట్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.ఈ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి 1,542 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. ఎకరానికి ఏడాదికి రూ.31 వేల లీజు చెల్లిస్తూ ప్రతి రెండేళ్లకోసారి 5 శాతం పెంపు చేసేలా ఒప్పందం కుదిరింది. దీని వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభించనుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్టులు రాబోయే 25 ఏళ్లలో 2.16 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించనున్నాయి. అత్యాధునిక బైఫేషియల్ సోలార్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల రెండు వైపుల నుంచి సూర్యకాంతిని గ్రహించి అధిక విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది.ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు అనుసంధానించేందుకు ప్రత్యేక 220/33 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్, హై వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ లైన్ నిర్మించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల పాటు క్లీన్ ఎనర్జీ సరఫరా జరగనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















