K. T. Rama Rao పోక్సో కేసు వ్యవహారంలో సీఎం Revanth Reddy, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumarపై తీవ్ర ఆరోపణలు చేశారు. బండి భగీరథ్‌ను కాపాడేందుకు ఇద్దరూ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. ‘‘పోక్సో కేసు నిందితుడిని 9 రోజులు దాచిపెట్టిందెవరు? సామాన్యుడైతే పోలీసులు ఊరుకుంటారా?’’ అని ప్రశ్నించారు. నిందితుడిని నిందితుడిగానే చూడాలని అన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 35 శాతానికి మించి ధాన్యం కొనుగోళ్లు జరగలేదని, రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలే నిరసనలు చేస్తున్నారని తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా రైతులు ఆందోళనలు చేశారని పేర్కొన్నారు.
45 డిగ్రీల ఎండల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 10 మంది రైతులు మరణించారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇక 2034 వరకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని సవాల్ విసిరారు. తాము కూడా రాజీనామా చేస్తామని కేటీఆర్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















