ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాలపై గాల్లో ఉన్న పారాగ్లైడర్‌ను ఓ విమానం ఢీకొన్న ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో 44 ఏళ్ల పారాగ్లైడర్ సబ్రినా ప్రాణాలతో బయటపడింది.
సబ్రినా తన పారాచూట్‌కు కెమెరా అమర్చుకుని గాల్లో విన్యాసాలు చేస్తుండగా, ఒక్కసారిగా విమానం దాని దారిలోకి వచ్చి ఢీకొట్టింది. ఈ ఢీకొనడంతో పారాచూట్ రెండు భాగాలుగా చీలిపోయింది. దీంతో ఆమె నియంత్రణ కోల్పోయి గాల్లో గిరగిరా తిరిగింది.
తీవ్రమైన పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ పారాచూట్‌ను తెరవడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు హెలికాప్టర్ ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత పైలట్ మాట్లాడుతూ, సమీపానికి వచ్చే వరకు పారాగ్లైడర్ కనిపించలేదని తెలిపారు. వేగంగా స్పందించే అవకాశం లేకపోవడంతో ప్రమాదం తప్పలేదని పేర్కొన్నారు.ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















