కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య స్వయంగా డీకే పేరును ప్రతిపాదించినట్లు మంత్రి హెచ్‌కే పాటిల్ వెల్లడించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
గురువారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సిద్ధరామయ్య రాష్ట్ర మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే నాయకత్వ మార్పుపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హెచ్‌కే పాటిల్.. సిద్ధరామయ్య మధ్యాహ్నం గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తారని, డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు.
ఇక, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటికే నాయకత్వ మార్పుపై అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కొత్త సీఎం శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం రాష్ట్ర రాజకీయాల భవిష్యత్ దిశ, అధికార సమీకరణాలపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
మరోవైపు, డీకే శివకుమార్ సీఎం పదవిని చేపట్టబోతున్నారనే వార్తలతో ఆయన అనుచరుల్లో సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకేకు చివరకు సీఎం పదవి దక్కనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















