పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ఇప్పటికిప్పుడు ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయలేదు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
ఈ ఒప్పందంపై తుది నిర్ణయం కోసం వైట్‌హౌస్‌లోని సిచ్యువేషన్ రూమ్‌లో ట్రంప్ తన సలహాదారులతో దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేకుండా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
వైట్‌హౌస్ అధికారి మాట్లాడుతూ, ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా అమెరికాకు మేలు చేసే విధంగా ఉండాలని, టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై అధ్యక్షుడు సంతృప్తి చెందాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు.
మరోవైపు, ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా తుది ఒప్పందం ఖరారు కాలేదని తెలిపారు.
ఇక అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, అవసరమైతే ఇరాన్‌తో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సామర్థ్యం అమెరికాకు ఉందని అన్నారు. అమెరికా సైనిక సామర్థ్యం పూర్తిగా సిద్ధంగా ఉందని కూడా పేర్కొన్నారు.
అదే సమయంలో అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా పశ్చిమాసియాలో తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రకటించింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















