హ్యాష్ ఆయిల్‌ను పోలీసుల కంటపడకుండా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు వేసిన పక్కా పథకాన్ని పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రయాణికుల్లా లారీల్లో ప్రయాణిస్తూ, ప్రతి వంద కిలోమీటర్లకు ఒక లారీ మారుస్తూ హ్యాష్ ఆయిల్‌ను నగరానికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. చివరికి కుషాయిగూడలో డెడ్‌డ్రాప్ పద్ధతిలో సరకు అప్పగించేందుకు సిద్ధమవుతుండగా నిందితులు పట్టుబడ్డారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలానికి చెందిన ఆటో డ్రైవర్ బోనంగి హరిశ్చంద్రప్రసాద్, విశాఖపట్నం పెందుర్తికి చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు సయ్యద్ రజా ఇమామ్, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ సీరం గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హరిశ్చంద్రప్రసాద్ సోదరుడు మార్క్ అలియాస్ రిషీ హ్యాష్ ఆయిల్ రవాణా వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు హ్యాష్ ఆయిల్‌ను తీసుకెళ్లి, నిర్దేశించిన ప్రాంతంలో సరకు అప్పగిస్తే కిలోకు రూ.5 వేల చొప్పున కమీషన్ ఇస్తానని నిందితులకు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
దీంతో రిషీ నుంచి 12 కిలోల హ్యాష్ ఆయిల్‌ను బ్యాగులో తీసుకున్న సయ్యద్ రజా ఇమామ్, సీరం గంగాధర్, హరిశ్చంద్రప్రసాద్‌లు హైదరాబాద్ బయల్దేరారు. ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తే మార్గమధ్యంలో పోలీసుల తనిఖీలు, నిఘా ఉండే అవకాశం ఉందని భావించి కొత్త పద్ధతిని ఎంచుకున్నారు.
సాధారణ ప్రయాణికుల మాదిరిగా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే లారీల్లో ఎక్కారు. సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక లారీ నుంచి మరో లారీకి మారుతూ నగరానికి చేరుకున్నారు. ఇలా మార్గమధ్యంలో పలుమార్లు వాహనాలు మార్చడంతో పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవచ్చని భావించినట్లు పోలీసులు తెలిపారు.
కుషాయిగూడకు చేరుకున్న అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో హ్యాష్ ఆయిల్ బ్యాగును ఉంచి, డెడ్‌డ్రాప్ పద్ధతిలో సరకు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే నిందితుల కదలికలపై ముందస్తు సమాచారం అందుకున్న ఉప్పల్ ఎస్‌వోటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
ఉప్పల్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం సోమవారం ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి సుమారు 12 కిలోల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితులను అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. హ్యాష్ ఆయిల్ సరఫరా వెనుక ఉన్న మార్క్ అలియాస్ రిషీతో పాటు ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















