స్సై ఎ. శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మండలం ఘనపూర్‌లోని విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి అల్వాల్‌కు భారీ వినాయక విగ్రహాన్ని తరలించేందుకు నిర్వాహకుడు శరత్‌యాదవ్ ఆటో ట్రాలీని ఏర్పాటు చేశాడు. సోమవారం విగ్రహాన్ని తరలిస్తుండగా మార్గమధ్యంలో 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతూ కనిపించాయి.
విద్యుత్ తీగల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్రైవర్ భానుప్రసాద్(28) నిర్వాహకుడికి ముందుగానే చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతని హెచ్చరికను పట్టించుకోకుండా ట్రాలీని ముందుకు తీసుకెళ్లాలని శరత్‌యాదవ్ ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ట్రాలీపై ఉన్న భారీ విగ్రహం విద్యుత్ తీగలకు తగలడంతో ట్రాలీ మొత్తం విద్యుత్ ప్రవాహానికి గురైంది.
దీంతో భయాందోళనకు గురైన డ్రైవర్ భానుప్రసాద్ ట్రాలీ నుంచి బయటకు దిగేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సుమారు 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న భానుప్రసాద్ మంగళవారం ఉదయం మృతిచెందాడు.
మృతుడి సోదరుడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిర్వాహకుడి నిర్లక్ష్యంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. భారీ వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌బీనగర్ నుంచి వేములవాడకు ట్రాక్టర్‌లో విగ్రహాన్ని తరలిస్తుండగా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై అది అదుపుతప్పి ముందుకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















