ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు కొత్త రికార్డు నమోదు చేసింది. ఒకే రోజు, ఒకే ఆర్డర్‌లో మొత్తం 2,700 టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలించినట్లు కాంకర్ ఇన్‌లాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) అధికారులు శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
సామర్లకోట, తణుకు కేంద్రాల నుంచి 42 వ్యాగన్లలో లోడ్ చేసిన బియ్యాన్ని 573 కిలోమీటర్ల దూరంలో ఉన్న తండియార్‌పేట డిపోకు రైలుమార్గం ద్వారా తరలించారు. అక్కడి నుంచి కంటెయినర్లలోకి మార్చి చెన్నై పోర్టు ద్వారా ప్రత్యేక నౌకలో చైనాకు ఎగుమతి చేశారు. గత నాలుగైదు సంవత్సరాల్లో ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి బియ్యం ఎగుమతి జరగలేదని తండియార్‌పేట ఐసీడీ అధికారులు పేర్కొన్నారు.
ఖర్చు తగ్గించేందుకే రైలు మార్గం
ఆహార భద్రత కారణాల దృష్ట్యా 2022–23లో భారత్ నుంచి చైనాకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించబడింది. అయితే తర్వాత వరిసాగు పెరగడం, బియ్యం నిల్వలు అధికంగా ఉండటంతో 2025 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలను కొంత మేర సడలించింది. ఈ నేపథ్యంలో చైనా వ్యాపారవేత్తలు, ఆంధ్రప్రదేశ్ బియ్యం ఎగుమతి ఏజెంట్ల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
తరలింపు బాధ్యతలను కాంకర్ సంస్థ చేపట్టింది. సామర్లకోట, తణుకు నుంచి చెన్నై వరకు రైలు వ్యాగన్లలో బియ్యాన్ని తరలించి, అక్కడ కంటెయినర్లలో లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి చైనాకు పంపించారు. మొత్తం ప్రక్రియను ఒకే రోజులో పూర్తి చేయడం ప్రత్యేకతగా నిలిచిందని అధికారులు తెలిపారు.
రోడ్డు మార్గానికి బదులుగా రైలు రవాణా వినియోగించడంతో సుమారు 40 శాతం ఖర్చు తగ్గినట్లు వెల్లడించారు. విశాఖ పోర్టులో ఎగుమతి ఖర్చులు ఎక్కువగా ఉండటం, అలాగే అవసరమైనన్ని కంటెయినర్లు అందుబాటులో లేకపోవడంతో ఎగుమతిదారులు చెన్నై పోర్టును ఎంచుకుంటున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















