రాష్ట్రంలో యోగాను కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా ప్రతి ఇంట్లో రోజువారీ సాధనగా మార్చేందుకు త్వరలో ‘ఏపీ యోగా ప్రచార పరిషత్’ను ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిషత్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యోగా ప్రచారం, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సచివాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీరపాండియన్, యోగా, ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
‘యోగాంధ్ర–2026’ కార్యక్రమం
ఈ నెల 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలపాటు ‘యోగాంధ్ర–2026’ పేరుతో ప్రత్యేక యోగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో యోగా పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వ్యక్తిగత విభాగంలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం, బృంద విభాగంలో సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, అలాగే జ్ఞాన ఆధారిత క్విజ్‌లు, వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నారు.
కృష్ణా నది వంతెనపై ప్రధాన కార్యక్రమం
ఈ నెల 21న అమరావతిలో కృష్ణా నది వంతెనపై ప్రధాన యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అక్కడ 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో యోగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పాల్గొనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ఈ రెండు వారాల యోగా ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి రూ.10 కోట్ల నిధుల కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పేర్కొన్నారు.
90 వీడియోలతో యోగా ప్రచారం
యోగాను ఇంటింటికీ చేరవేసే లక్ష్యంతో నాలుగు విభాగాల్లో 90 వీడియోలను రూపొందించినట్లు యోగా, ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు తెలిపారు. రోగ నివారణకు ప్రత్యేక ఆసనాలు, రోజువారీ సాధన, యోగా సందేహాలు వంటి అంశాలు ఈ వీడియోల్లో ఉంటాయని చెప్పారు.
ఈ వీడియోలను పొందేందుకు 8142404888 అనే వాట్సప్ నంబర్‌కు ‘హాయ్’ అని పంపితే క్యూఆర్ కోడ్ వస్తుందని, దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సేవలు దీర్ఘకాలం అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.
మొత్తంగా ఈ కార్యక్రమాల ద్వారా యోగాను రాష్ట్ర ప్రజల జీవనశైలిలో భాగంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















