కువైట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఘటనపై ఇరాన్–అమెరికా మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రతిఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
Islamic Revolutionary Guard Corps ప్రతినిధి హుస్సేన్ మొహబ్బీ మాట్లాడుతూ, కువైట్ ఎయిర్‌పోర్టును తమ దళాలు లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా తయారు చేసిన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇరాన్ డ్రోన్లను అడ్డుకోవడంలో ఆ వ్యవస్థ విఫలమైందని పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. United States Central Command సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇరాన్ వాదనలు పూర్తిగా అబద్ధమని పేర్కొంది. కువైట్ పౌర విమానాశ్రయంపై డ్రోన్ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆరోపించింది.
కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాల్లో డ్రోన్ టెర్మినల్‌ను ఢీకొంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటనలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, 63 మంది గాయపడ్డారు.
దాడి తర్వాత విమానాశ్రయంలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















