ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా దేశంలోనే తొలిసారిగా మట్టిలో సహజంగా కలిసిపోయే బయోడిగ్రేడబుల్ పాల ప్యాకెట్ పౌచ్‌లను మదర్ డెయిరీ ఆవిష్కరించింది. ఇది నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుబంధ సంస్థగా పనిచేస్తున్న మదర్ డెయిరీ నుండి వచ్చిన కీలక పర్యావరణ అనుకూల ఆవిష్కరణగా నిలిచింది.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, ముఖ్యంగా రీసైక్లింగ్ పరిధిలోకి రాని ఫ్యుజిటివ్ ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం చూపడం ఈ కొత్త ప్యాకేజింగ్ ప్రధాన లక్ష్యమని సంస్థ తెలిపింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ టెక్నాలజీ పెద్ద అడుగు అని పేర్కొంది.
ఈ కొత్త ప్యాకేజింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మదర్ డెయిరీ నాలుగేళ్లకు పైగా పరిశోధనలు చేసింది. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి, పర్యావరణానికి అనుకూలమైన మెటీరియల్‌ను వినియోగించి ఈ పౌచ్‌లను తయారు చేసినట్లు వెల్లడించింది.
తయారీ ఖర్చు కొంత పెరిగినప్పటికీ, ఆ భారాన్ని వినియోగదారులపై వేయబోమని మదర్ డెయిరీ ఛైర్మన్ మీనేష్ షా స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















