అంతర్జాతీయ పరిస్థితులు మరియు విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు పెరుగుదల నేపథ్యంలో ఇండిగో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఒత్తిళ్లు మరియు మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఇండిగో తెలిపిన వివరాల ప్రకారం, జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు లంకావి, క్రాబి, హో చి మిన్ సిటీ, హాంకాంగ్, షాంఘై మార్గాల్లో సర్వీసులు నిలిపివేయబడతాయి. అలాగే సియమ్ రీప్‌కు జులై 3 నుంచి సెప్టెంబర్ 30 వరకు సేవలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడితే అక్టోబర్ 1 నుంచి ఈ మార్గాల్లో తిరిగి బుకింగ్‌లు ప్రారంభిస్తామని ఇండిగో స్పష్టం చేసింది. అంతేకాకుండా షెడ్యూల్ కంటే ముందే సేవలను పునరుద్ధరించే అవకాశం కూడా ఉందని కంపెనీ పేర్కొంది.
విమాన ఇంధన ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















