సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం, ప్రతిపక్ష నేతలకు తీవ్ర సవాల్ విసిరారు. ‘‘ఎవరేం చేశారో అసెంబ్లీకి వచ్చి చర్చిద్దాం’’ అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌లో ఉన్నారని, పన్నెండేళ్లుగా మోదీ ప్రధానిగా ఉన్నా రాష్ట్రానికి న్యాయం జరగలేదని విమర్శించారు.
మియాపూర్ సభా ప్రాంగణం నుంచి సైబరాబాద్ నగర పాలక సంస్థ (CMC) నూతన కార్యాలయం సహా రూ.1,674.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించడం లేదని ఆరోపించారు. గోదావరి జలాల ప్రాజెక్టులు, సింగూరు, తుమ్మిడిహెట్టి వంటి పథకాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మూసీ నది అభివృద్ధిని కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
కేసీఆర్, కిషన్‌రెడ్డి చీకటి ఒప్పందాలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించిన సీఎం, రాష్ట్రం కోసం తాను దిల్లీకి వెళ్తున్నా సహకారం అందడం లేదని తెలిపారు. మూడు నెలల్లో గాజులరామారంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్ పూర్తి చేస్తామని ప్రకటించారు.
సైబరాబాద్‌ను గూగుల్, కాగ్నిజెంట్ తరహా ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. లక్ష ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, త్వరలో మంత్రి పొంగులేటి పథకాన్ని ప్రకటిస్తారని తెలిపారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం, అమెజాన్ వంటి వేదికలపై ఉత్పత్తుల విక్రయం అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
సభలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నా తన నియోజకవర్గానికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం అభివృద్ధికి దోహదపడుతోందని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















