పిడుగులు పడుతున్నప్పుడు అర్జునా – ఫల్గుణ అని ఎందుకు అనాలి
పిడుగులు పడుతున్నప్పుడు అర్జునా – ఫాల్గుణ అని ఎందుకు జపించాలి? అసలు ఫాల్గుణ అనే నామానికి అర్థం ఏమిటి…..??
మన చిన్నప్పుడు పిడుగులు పడినప్పుడు భయపడితే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు అర్జున ఫాల్గుణ అని నామాలు జపించమని చెప్పారా? అవి ఎందుకు జపిస్తారో తెలుసా ? ఇలా జపించడానికి రెండు కారణాలున్నాయి.
అవేంటి అంటేమొదటి కారణం ఏంటి అంటే మీరు ఒకవేళ మామూలు సందర్భాల్లో మంత్రం జపిస్తే నరుడు నారాయణుడుని తలచుకుంటున్నట్లు అర్థం.
అంటే మానవుడు దేవుడిని జపిస్తున్నట్లు. మనం మామూలుగా దేవుడిని తేల్చుకుంటాం కదా అలాగే ఈ మంత్రాన్ని జపిస్తారు.
ఇంకా రెండవ కారణం ఏంటి అంటే సందర్భానుసారం మాత్రం చెప్పడం. వర్షం పడుతున్నప్పుడు ఈ మంత్రం చెప్తే పిడుగులు ఆగిపోతాయి.
అంటే ఈ మంత్రం జపిస్తే పిడుగులు రాకుండా రక్షించమని దేవుడిని కోరుకుంటున్నట్లు అర్థం. ఈ రెండవ కారణం వెనకాల ఒక చిన్న కథ ఉంది.
ఖాండవ వన దహనం సమయము అప్పుడు అగ్నిహోత్రుడు కృష్ణార్జునలను ఆ వనాన్ని దహిస్తానున అని అడిగారట.
ఒక మహారాజు పెద్ద యజ్ఞం చేశాడు అని అందులో నెయ్యి తాగి తాగి అజీర్ణం అయిందని బాగా ఆహారం కావాలి అని అగ్నిహోత్రుడు చెప్పారు.
ఈ మాట విన్న కృష్ణార్జునులు ఆశ్చర్యపోయారు. అదేంటి అజీర్ణం అన్నారు కానీ మళ్ళీ ఆహారం కావాలి అంటున్నారు అని అగ్నిహోత్రుడి ని అడిగారు.
అజీర్ణం తగ్గాలంటే మందులు కావాలి మందులు కావాలి అంటే ముందు తయారు చేసుకోవాలి ఈ అడవిలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ అడవిని మొత్తం దహిస్తే నా అజీర్ణం తగ్గుతుంది అని చెప్పారు అగ్నిహోత్రుడు.
ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయమని. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆగారు అని అగ్నిహోత్రుడిని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు ” ఇది ఖాండవ వనం.
అంటే ఇది ఇంద్రుడి అరణ్యం. నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకే తినలేక పోతున్నాను” అని సమాధానమిచ్చారు.
అప్పుడు కృష్ణార్జునులు తాము కాపాడతామని చెప్పారు. అగ్నిదేవుడు చెప్పినట్టే తన ముట్టుకోగానే వర్షం మొదలైంది.అప్పుడు అర్జునుడు వర్షం వైపుకి బాణాలు వేశాడు. అలా తన బాణాల వర్షం తో వర్షాన్ని ఆపాడు.
అప్పటినుండి అది వరంగా మారింది. పిడుగు కానీ వర్షం కానీ ఉరుములు కానీ వచ్చినప్పుడు అర్జున ఫాల్గుణ బీభత్స కృష్ణ కిరీటి విజయ పార్థ సవ్యసాచి ధనంజయ అన్న 10 నామాలు జపిస్తే ఉరుములు పిడుగులు ఆగుతాయని శాస్త్రం చెబుతోంది.
మరొకథ ఉంది
పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో విరాట మహారాజు కొలువులో పలురకాల వృత్తిలో ఉంటూ అక్కడే బస చేశారని మీకు తెలిసినదే.
అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు.పాండవులు ఎక్కడ ఉన్నది తెలుసుకున్న కౌరవులు వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేసేందుకు విరాటరాజు రాజ్యంపై దాడికి దిగుతారు.
అప్పుడు అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరకుమారుడి రథానికి రథసారధిగా వ్యవహరిస్తాడు.అయితే కౌరవులు లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు.రాజకుమారుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.
అయితే భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు.నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు.
అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలు ఉంటాయి.ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు.
గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని, ఎంతటి వీరుడి నైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని, దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరిటి అంటారని,
కుంతీ దేవి అసలు పేరు పృథ, ఆమెకు జన్మించడం వలన పార్ధ అంటారని, ఇక ఉత్తర ఫల్గునీ నక్షత్రం మరియు పూర్వ పాల్గొని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడిని నమ్మిస్తాడు.
ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే పిడుగులు పడటం అగుతుందని, అలాగే ధైర్యం వస్తుందని పెద్దలు చెబుతారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















