తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సర్వదర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతోంది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్–2లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. అలాగే నారాయణగిరిలోని 9 షెడ్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్లు శిలాతోరణం సర్కిల్ వరకు విస్తరించి, అక్కడి నుంచి బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు కొనసాగుతున్నాయి.
వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లోని 6 కంపార్టుమెంట్లలో టైమ్‌స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులు తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.
భక్తుల రద్దీ పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















