కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందని మంత్రి అజహరుద్దీన్ అన్నారు. గాంధీభవన్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి సుమారు 200కు పైగా దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. వాటిలో చాలా సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేశానని చెప్పారు. అలాగే 50 వరకు సమస్యలను వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించినట్లు వెల్లడించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. పీసీసీ చీఫ్ ప్రారంభించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున బీఆర్ఎస్ నేతలు ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య గత ప్రభుత్వానిదేనని, అయినా దాన్ని తమ ప్రభుత్వం పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే SIR అంశంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మైనార్టీల ఓట్లు ఎక్కువగా తొలగించబడుతున్నాయని వార్తల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిజమైన ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజల హక్కులను కాపాడుతామని మంత్రి అజహరుద్దీన్ స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















