రైళ్లు, రైల్వే స్టేషన్లలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో 1989 రైల్వే చట్టంలో సవరణలు చేస్తూ ‘జన విశ్వాస్’ పేరుతో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ మార్పులపై అవగాహన కల్పించేందుకు కాజీపేటలో ప్రత్యేక పోస్టర్‌ను ఆర్పీఎఫ్ సీఐ ఛటర్జీ, ఎస్సై వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కొత్త నిబంధనలపై పలు కీలక వివరాలను వెల్లడించారు.
కొత్త నియమాల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం, అనుమతించిన దూరానికి మించి ప్రయాణించడం లేదా ఇతరుల టికెట్‌పై ప్రయాణించడం వంటి వాటికి రూ.500 అదనపు ఛార్జీతో పాటు సాధారణ ప్రయాణ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు.
అనధికారికంగా రైల్వే ప్రాంగణంలోకి ప్రవేశించడం, తినుబండారాలు విక్రయించడం, భిక్షాటన చేయడం వంటి చర్యలకు రూ.500 నుంచి రూ.2,000 వరకు జరిమానాలు విధిస్తారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా ఉంటుంది.
రిజర్వ్ కోచ్‌లో అనధికారికంగా ప్రయాణిస్తే రూ.2,000, రిజర్వ్ సీటు లేదా బెర్త్ ఖాళీ చేయడానికి నిరాకరిస్తే రూ.1,000, ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తారు. మహిళల రిజర్వ్ కోచ్‌లోకి పురుషులు ప్రవేశిస్తే రూ.2,500 జరిమానా పడుతుంది.
అదేవిధంగా ప్రమాదకర వస్తువులు తీసుకెళ్తే రూ.10,000 వరకు, రైల్వే ప్రాంగణంలో లేదా రైళ్లలో ధూమపానం చేస్తే రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు.
ఈ జరిమానాలను అధికారులు అక్కడికక్కడే వసూలు చేసి రశీదు ఇవ్వనున్నారు. జరిమానా చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















