సింగరేణి ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బుధవారం ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని సూచించింది. 8 వారాలపాటు లేదా అభియోగపత్రం దాఖలు అయ్యే వరకు ఈ షరతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కేసు విచారణ సమయంలో సాక్షులను ప్రభావితం చేయడం లేదా సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని కోర్టు హెచ్చరించింది. అలాగే ఈ కేసుపై మీడియాలో మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో స్పందించడం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మే 26న సింగరేణి భవన్ జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది. సింగరేణి ఆస్తులకు నష్టం కలిగించేలా, రైల్వే ట్రాక్‌లపై విధ్వంసక చర్యలకు ప్రేరేపించేలా ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో బెయిల్ కోరుతూ బాల్క సుమన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కె. సుజన విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















