కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వెళ్లనున్నారు.
2024 ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా తుంగభద్ర డ్యామ్‌లోని గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చేపట్టిన పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం మొత్తం 33 గేట్లను పూర్తిగా మార్చి ఆధునికీకరించారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ డ్యామ్ ద్వారా నీటి కేటాయింపులు ఉన్న నేపథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు ఆధిత్యనాథ్ దాస్, కార్యదర్శి శ్రీధర్, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, సీనియర్ ఇంజినీర్లు రమేశ్‌బాబు, కె. శ్రీనివాస్, కె. ప్రసాద్ తదితర అధికారులు హాజరవుతారు.
ఈ కార్యక్రమం నీటి వనరుల నిర్వహణ, డ్యామ్ భద్రత మరియు అంతర్రాష్ట్ర సమన్వయానికి కీలకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















