రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో కూడిన 35 మంది బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది.
గత ఏప్రిల్‌లో ఇదే తరహాలో అధికారులు, ఉపాధ్యాయులు ఫిన్లాండ్‌లో పర్యటించి అక్కడి పాఠశాల వ్యవస్థను అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే క్రమంలో మరో అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనకు ఈ బృందం సిద్ధమవుతోంది.
ఈసారి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో పాటు ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, వివిధ ఆచార్యులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు మొత్తం 35 మంది ఈ నెల 28న జర్మనీకి బయలుదేరనున్నారు.
అయితే పర్యటనకు కేవలం మూడు రోజులే సమయం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యాశాఖ ఈ పర్యటన లక్ష్యం ఏమిటి, ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఏ ఏ విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థలను సందర్శిస్తారు వంటి కీలక వివరాలను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హంగా మారింది.
ఈ పర్యటనపై విద్యా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















