పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ఈ ఆందోళనలో భాగంగా పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆదివారం నిరాహార దీక్ష ప్రారంభించారు.
దీక్ష ప్రారంభానికి ముందు సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి నిరసనను ప్రారంభించారు.
జంతర్‌మంతర్ వద్ద వందలాది మంది ఉద్యమకారులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పలువురు రైతు నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. “నేను ఇక్కడ ఆనందంగా కూర్చోలేదు. పరిస్థితులే నన్ను ఈ నిరాహార దీక్షకు నడిపించాయి. విద్య అనేది నాకు గత 40 ఏళ్లుగా అత్యంత ఆత్మీయ అంశం. విద్యా వ్యవస్థలో సమస్యలపై యువత గళమెత్తినప్పుడు నేను మౌనంగా ఉండలేకపోయాను” అని అన్నారు.
ఇక అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















