వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఊరటనిచ్చే విధంగా చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.183 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఎల్పీజీ సరఫరా వ్యవస్థ మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.3,113 నుంచి తగ్గి రూ.2,930కి చేరనుంది.
ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై ఉన్న కొన్ని ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. యుద్ధ పరిస్థితుల కారణంగా ముందు విధించిన పరిమితులను తొలగించి, సరఫరాను మునుపటి స్థాయికి తీసుకువచ్చింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతులు మెరుగుపడటం కూడా ఈ నిర్ణయానికి కారణాలుగా పేర్కొంటున్నారు.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఎల్పీజీ సరఫరా పరిస్థితి సాధారణమవుతోందని, దశలవారీగా ఆంక్షలు సడలిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఇంధన రంగంలోనూ ధరల తగ్గింపు కొనసాగుతోంది. ప్రైవేటు రంగ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గింపును ప్రకటించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం ఈ నిర్ణయాలకు దోహదం చేసింది.
అదేవిధంగా ఏవియేషన్ రంగానికి ఊరటనిచ్చేలా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర కూడా లీటర్‌కు రూ.5 తగ్గింది. దీంతో ATF ధర రూ.115 నుంచి రూ.110కి పడిపోయింది. ఈ తగ్గింపు దేశీయ విమానయాన సంస్థలకు ఖర్చుల భారాన్ని తగ్గించనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















