దేశ రాజధాని దిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో గత 24 గంటల్లో సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
దాదర్, పార్లే, హింద్‌మాతా, చార్‌కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరీ వంటి పలు పల్లపు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో నగర జీవనం తీవ్రంగా ప్రభావితమైంది. లోకల్ రైళ్ల రాకపోకలపై వరద ప్రభావం పడగా, అనేక చోట్ల రైలు పట్టాలు నీటమునిగాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ముంబయి మరియు శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే సముద్రంలో అలలు 4.27 మీటర్ల ఎత్తుకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఇక దిల్లీలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే సుమారు ఐదు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు చేరుకున్నాయి. దిల్లీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















