మేఘాలయ హనీమూన్ హత్య కేసులో (Meghalaya Honeymoon Murder) సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే ఇప్పటికే ఆమె జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఈ దశలో జోక్యం చేసుకోవడం అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో బెయిల్ రద్దు అభ్యర్థనను కొనసాగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ విచారణ సందర్భంగా కోర్టులో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. తొలుత బెయిల్ రద్దు చేసే అవకాశాన్ని పరిశీలించినట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ, తర్వాత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ మే 11న సోనమ్ రఘువంశీతో వివాహం చేసుకున్నాడు. అనంతరం మే 20న హనీమూన్ కోసం ఈ దంపతులు మేఘాలయకు వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరూ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా 11 రోజుల తర్వాత సోహ్రా ప్రాంతంలోని ఓ జలపాతం సమీపంలో రాజా రఘువంశీ మృతదేహం లభించింది. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో ఇది హత్యగా నిర్ధారించారు. అనంతరం సోనమ్ జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సాంకేతిక కారణాలతో సోనమ్‌కు షిల్లాంగ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మేఘాలయ హైకోర్టు కూడా ఈ బెయిల్‌ను సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















