ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్, డెబిట్ కార్డుల ద్వారా టికెట్ చెల్లింపులకు ప్రయాణికులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి డిజిటల్ చెల్లింపుల వాటా 28.87 శాతానికి చేరినట్లు ఆర్టీసీ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సుమారు 57 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అన్ని బస్సుల్లో కండక్టర్లకు సాధారణ టిమ్స్ స్థానంలో ఈ-టిమ్స్ పరికరాలను అందించారు. దీంతో డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి.
2026 జనవరి నుంచి జూన్ వరకు డిజిటల్ చెల్లింపులపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర వివరాలు బయటపడ్డాయి. జనవరిలో 24.89 శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపులు ఫిబ్రవరిలో 26.05, మార్చిలో 27.67, ఏప్రిల్‌లో 28.29, మేలో 28.35, జూన్‌లో 28.87 శాతానికి పెరిగాయి.
ఇదే సమయంలో నగదు చెల్లింపులు తగ్గుముఖం పట్టాయి. జనవరిలో 75.11 శాతంగా ఉన్న నగదు చెల్లింపులు జూన్ నాటికి 71.13 శాతానికి తగ్గాయి. ఆరు నెలల కాలంలో మొత్తం రూ.1,623.33 కోట్ల టికెట్ ఆదాయం నమోదు కాగా, అందులో రూ.444.64 కోట్లు డిజిటల్ లావాదేవీల ద్వారా వచ్చాయి.
దూరప్రాంత ప్రయాణాల్లో ఈ విధానం కండక్టర్లకు సౌలభ్యంగా మారుతుండగా, రద్దీగా ఉండే హైదరాబాద్ సిటీ బస్సుల్లో మాత్రం కొంత ఇబ్బంది ఎదురవుతోంది. ఈ-చెల్లింపులు పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి రావడం సమస్యగా మారుతోంది. అయితే చిల్లర సమస్యకు మాత్రం డిజిటల్ చెల్లింపులు పరిష్కారంగా మారుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















