గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం, ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాల వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఐటీడీఏల ప్రస్తుత పరిస్థితులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు.
అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతి, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై మంత్రి సంధ్యారాణి వివరాలు అందించారు. అలాగే తెదేపా సంస్థాగత బలోపేతానికి చేపడుతున్న చర్యలను కూడా లోకేశ్‌కు తెలియజేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ సూచనల మేరకు అరకు లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో త్వరలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సంధ్యారాణి తెలిపారు. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేసే అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















