దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడవచ్చన్న భయాలు నెలకొనడంతో వరుసగా ఐదో రోజూ దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 75,708.19 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై.. ఇంట్రాడేలో 75,474.43 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 331.62 పాయింట్లు కోల్పోయి 76,059.77 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 102.15 పాయింట్లు నష్టపోయి 23,767.45 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీ ఆటో, రియాల్టీ, ఫార్మా రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.57గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 97.68 డాలర్ల వద్ద ఉండగా.. బంగారం ఔన్సు 4,059 డాలర్ల వద్ద ట్రేడైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















