దేశ జాతీయ గేయం **‘వందేమాతరం’**కు మరింత చట్టపరమైన రక్షణ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఇప్పటికే రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.
బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971 చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. వందేమాతరం గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అది ఆలపిస్తున్న సమయంలో కావాలనే ఆటంకం కలిగించడం వంటి చర్యలను నేరంగా పరిగణించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జాతీయ గీతమైన **‘జనగణమన’**కు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు. లోక్‌సభ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ బిల్లు చట్టంగా మారనుంది.బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















