సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పాలడుగు సత్యనారాయణతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం కలిసింది. ఈ సందర్భంగా సూపర్ ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో వ్యవసాయంపై దాని ప్రభావం తదితర అంశాలపై చర్చించారు.
దేశవ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, రైతులపై ఎంతమేర ప్రభావం పడుతోంది అనే అంశాలను పరిశీలించేందుకు శాస్త్రవేత్తల బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు.
ఈ బృందాలు రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి పంటలు, వర్షపాతం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించనున్నాయి. అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి నుంచి క్షేత్రస్థాయి నివేదిక అందిన వెంటనే పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతుందని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















