తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ ఉత్సవాలకు ఆగస్టు 22న అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల సమయంలో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల నివారణకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.
మూడు రోజుల పాటు సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ఠ, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
పవిత్రోత్సవాల నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. ఆగస్టు 22న అంకురార్పణ సందర్భంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు.
ఆగస్టు 23 నుంచి 25 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను నిర్వహించరు. అలాగే ఆగస్టు 25న అష్టదళ పాదపద్మారాధన సేవను కూడా రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఆగస్టు 26న కల్యాణోత్సవ సేవను రద్దు చేసినట్లు తితిదే తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















