ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల లెఫ్ట్ మెయిన్ కెనాళ్లను ప్రారంభించి నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని కూడా చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ మధ్య రూ.600 కోట్ల పరిహారం అందజేస్తామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పనులు 77 శాతం పూర్తయ్యాయని నిమ్మల తెలిపారు. ప్రాజెక్టును కేవలం సాగునీటి వనరుగా కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు రివర్ బేస్డ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా పేర్కొన్నారు.
పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ నెలాఖరులోగా అనకాపల్లికి నీటిని తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కెనాల్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరింత సమృద్ధిగా నీరు అందే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా డేటా సెంటర్లు, ఇతర పారిశ్రామిక అవసరాలకు సుమారు మూడు టీఎంసీల నీటిని లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అందిస్తే సరిపోతుందని మంత్రి తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రాధాన్యంగా భావిస్తున్న 36 ప్రాజెక్టులను నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















