అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వంటి వేరబుల్ పరికరాల తయారీలో కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చైనాపై తయారీ పరంగా ఉన్న ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో భారత్, వియత్నాంలో ఉత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి పిక్సెల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ తయారీని చైనా నుంచి ఇతర దేశాలకు తరలించే ప్రణాళికను గూగుల్ తన సరఫరాదారులకు తెలియజేసినట్లు సమాచారం. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా వ్యవస్థను మరింత విస్తరించుకోవడంపై గూగుల్ దృష్టి పెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల తయారీలో చైనాకు కీలక పాత్ర ఉంది. అయితే చైనాలో గూగుల్ పిక్సెల్ ఫోన్లను విక్రయించకపోవడంతో అక్కడి తయారీని ఇతర దేశాలకు తరలించడం సంస్థకు కొంత సులభమయ్యే అవకాశం ఉంది. గత ఏడాది పిక్సెల్ ఫోన్ల ఎగుమతులు సుమారు 1.20 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది 8 నుంచి 10 శాతం వరకు ఎగుమతులు పెరగవచ్చని గూగుల్ అంచనా వేస్తోంది.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీ, అభివృద్ధి ప్రక్రియ స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే మరింత సంక్లిష్టంగా ఉంటుంది. అయినప్పటికీ గూగుల్ వియత్నాంలో హైఎండ్ పిక్సెల్ ఫోన్ల అభివృద్ధి, తయారీని ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తోంది.
భారత్‌లో ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి తయారీ భాగస్వాముల సహకారంతో పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను గూగుల్ తయారు చేస్తోంది. ఇటీవల పిక్సెల్ 11 సిరీస్‌ను విడుదల చేసిన నేపథ్యంలో.. రాబోయే పిక్సెల్ 12 సిరీస్ ఉత్పత్తిని పూర్తిగా చైనా వెలుపల నిర్వహించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి?
భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగం వేగంగా విస్తరిస్తుండటంతో గూగుల్ దేశీయ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. తయారీని భారత్‌లో పెంచడం ద్వారా స్థానిక డిమాండ్‌ను అందుకోవడంతో పాటు ఎగుమతులకు కూడా అవకాశం ఏర్పడుతుంది.
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. భారత్‌లోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లలో గూగుల్ ముందంజలో ఉంది. దీంతో దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు తయారీ సామర్థ్యాలను పెంచుకోవడం గూగుల్‌కు కీలకంగా మారింది.
ఇప్పటికే శామ్‌సంగ్ తన స్మార్ట్‌ఫోన్ తయారీలో చైనా వాటాను గణనీయంగా తగ్గించింది. యాపిల్ కూడా తయారీ భాగస్వాముల ద్వారా భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తిని విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ కూడా భారత్‌ను తన గ్లోబల్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















