అంతరిక్ష పరిశోధనల్లో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ‘జూక్-3’ రాకెట్‌ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో పాటు, దాని తొలి దశను విడదీసి తిరిగి భూమిపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగింది. బుధవారం డోంగ్‌ఫెంగ్ వాణిజ్య అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
సుమారు 66.1 మీటర్ల పొడవున్న ‘జూక్-3’ రాకెట్ తొలి దశలో తొమ్మిది ఇంజిన్లు ఉన్నాయి. ప్రయోగం పూర్తయిన తర్వాత తొలి దశ రాకెట్ నుంచి విడిపోయి గాన్సు ప్రావిన్స్‌లోని మిన్చిన్ కౌంటీలో నిర్దేశిత ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయింది.
రాకెట్ తొలి దశను తిరిగి స్వాధీనం చేసుకోవడం చైనాకు ఇది రెండోసారి. అయితే భూమిపై విజయవంతంగా ల్యాండ్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఏడాది జులై 10న ‘లాంగ్ మార్చ్-10బీ’ రాకెట్ తొలి దశను సముద్రంలో ల్యాండ్ చేయగా.. తాజా ప్రయోగంలో భూభాగంపైనే దాన్ని విజయవంతంగా దింపారు.
రాకెట్లను పునర్వినియోగించుకునే సాంకేతికతపై చైనా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం కీలకంగా మారింది. అమెరికాకు చెందిన SpaceX, Blue Origin సంస్థలు ఇప్పటికే రాకెట్ తొలి దశలను తిరిగి ల్యాండ్ చేసి పునర్వినియోగం చేస్తున్నాయి. ఈ విధానం విజయవంతంగా అమలైతే భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















